Tirupati ఎంపీగా గురుమూర్తి.. భారీ మెజార్టీతో గెలుపు - Darsi Live News

Tirupati ఎంపీగా గురుమూర్తి.. భారీ మెజార్టీతో గెలుపు - Darsi Live News

Tirupati ఎంపీగా గురుమూర్తి.. భారీ మెజార్టీతో గెలుపు - Darsi Live News 

చిత్తూరు: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై 2 లక్షల 71 వేల 391 ఓట్ల మెజార్టీతో గురుమూర్తి గెలిచారు. వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి 6 లక్షల 25 వేల 820 ఓట్లు, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 3,54,253 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 57 వేల 070 ఓట్లు వచ్చాయి. లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి గురుమూర్తి ఆధిక్యంలోనే కొనసాగారు. అన్ని రౌండ్లు పూర్తయ్యే సరికి భారీ మెజార్టీతో పనబాకపై గురుమూర్తి గెలుపొందారు. ఈ తాజా విజయంతో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు, స్థానిక నేతలు సంబరాలు జరుపుకున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి 7,22,877, టీడీపీకి 4,94,501 ఓట్లు వచ్చాయి.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి