Karthika Deepam : మే 13 ఎపిసోడ్: ఆవేశంతో ఊగిపోయిన డాక్టర్ బాబు.. ‘నాన్నా.. వద్దు నాన్నా

Karthika Deepam : మే 13 ఎపిసోడ్: ఆవేశంతో ఊగిపోయిన డాక్టర్ బాబు.. ‘నాన్నా.. వద్దు నాన్నా

Karthika Deepam : మే 13 ఎపిసోడ్: ఆవేశంతో ఊగిపోయిన డాక్టర్ బాబు.. ‘నాన్నా.. వద్దు నాన్నా........

మళ్లీ హిమ, సౌర్యలకు కష్టాలు మొదలయ్యాయి. పాపం అటు తల్లి, ఇటు తండ్రి పంతాలతో పసి మనసుల్ని బాదపెడుతున్నారు. బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్.. నేడు(2021 మే 13)న 1038 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఆ హైలైట్స్ బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్.. నేడు(2021 మే 13)న 1038 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది.
 

1038వ ఎపిసోడ్‌ హైలైట్స్.. ఆదిత్య వచ్చి.. ‘పిల్లల్ని బ్యాగ్ సద్దుకుని రండి.. శ్రీరామ్ నగర్‌ బస్తీకి తీసుకుని రమ్మన్నాడు అన్నయ్యా.. మాలతీ నువ్వు కూడా రా.. అన్నయ్య తీసుకుని రమ్మన్నాడు’ అని ముగ్గురినీ తీసుకుని వెళ్లి శ్రీరామ్ నగర్ బస్తీలో దింపుతాడు. సీన్ కట్ చేస్తే మోనిత ఇంటికి చేరుకునే సరికి ప్రియమణి సోఫాలో పడుకుని మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అది చూసి మోనిత ఫ్లవర్ వాజ్ ఎత్తేస్తుంది. దాంతో ప్రియమణి సారీ చెప్పి అక్కడ నుంచి పారిపోతుంది. మోనిత ఆవేశంగా సోఫాలో కూర్చుని.. ‘ఈ కార్తీక్ నన్ను మనశ్శాంతిగా బతకనిచ్చేలా లేడు..’ అని రగిలిపోతుంది.
 

సీన్ కట్ చేస్తే రాత్రి డిన్నర్ కార్తీక్, పిల్లలు కింద కూర్చుని దీప ఇంట్లో తింటూ ఉంటే.. దీప పక్కనే కూర్చుని మౌనంగా చూస్తుంది. మాలతి వాళ్లకి వడ్డిస్తూ ఉంటుంది. దీపతో మీరు తినేయండమ్మా’ అంటుంది. ‘నేను తర్వాత తింటానులే మాలతీ.. భోజనమే మానెయ్యనులే..’ అంటుంది దీప. ‘ఇక్కడే బాగుంది నాన్నా నాకు.. ’ అంటుంది సౌర్య. ‘తెలుసమ్మా ముగ్గురికీ ఇక్కడుంటే బాగుంటుంది అని తెలుసు.. ఉండండీ.. మీ అమ్మతోనే ఉండండీ.. టైమ్‌కి మందులు ఇస్తూ ఉండండీ.. స్టవ్ దగ్గరకి వెళ్లనివ్వకండీ..’ అంటాడు కార్తీక్. ‘అదేంటి డాడీ అమ్మని మమ్మల్ని రమ్మంటావ్ అనుకున్నాను.. లేదంటే నువ్వు కూడా ఇక్కడే ఉంటావ్ అనుకున్నాను..’

అంటుంది హిమ. ‘లేదురా.. అప్పడప్పుడు నేను వస్తూ ఉంటాను.. మాలతీ ముందుగా ఇక్కడికి వచ్చి మీకు టిఫిన్ భోజనం వండి.. అక్కడికి వస్తుంది..’ అంటాడు. ‘ఫర్వాలేదు డాక్టర్ బాబు.. నేను నా పిల్లలకు ఆ మాత్రం టిఫిన్, భోజనం వండిపెట్టుకోగలను..’ అంటుంది దీప. ‘అవసరం లేదు అన్ననుగా.. మాలతీ వస్తుంది..’ అంటాడు కార్తీక్. దీప మాట వినకపోవడంతో.. ‘వద్దు అన్నాను కదా?’అంటూ తినే కంచంలో చేయి కడిగేసుకుంటాడు.. కంచం గిరిటేస్తాడు. ‘అయ్యో అదేంటి బాబు..’ అని మాలతీ షాక్ అవుతుంటే.. పిల్లలు బిత్తరపోతారు. దీప కంగారు పైకి లేస్తుంది. కార్తీక్ ఆవేశంగా పైకి లేచి.. దీపని ‘ఏం నీకు ఓ సారి చెబితే అర్థం కాదా? నువ్వు వంటే కాదు ఏ పని చేయడానికి వీల్లేదు..

నీకు ఆరోగ్యం బాలేదు.. నీకు అక్కడ మనశాంతి లేదని ఇక్కడికి వచ్చావ్.. ఇక్కడ కూడా కష్టపడతానంటే చూస్తూ ఊరుకోను.. ఇదంతా చూస్తూ ఎందుకు ఓపిక పడుతున్నానో తెలుసా..? పిల్లల కోసం.. వాళ్లు నువ్వు లేనిదే ఉండరని వాళ్లకి ఇక్కడ కంఫర్ట్‌గా ఉండదని తెలిసినా ఉంచే వెళ్తున్నాను.. కంఫర్ట్ కూడా అరేంజ్ చేయను. వాళ్లకి కూడా తెలిసి రావాలి..’ అంటాడు. వెంటనే పిల్లలు చేయి కడ్డుక్కుని పైకి లేచి కార్తీక్ చెరోవైపు పట్టుకుని.. ‘నాన్నా వద్దు నాన్నా వెళ్లొద్దు నాన్నా.. ’ అని సౌర్య.. ‘డాడీ.. ప్లీజ్ డాడీ.. అందరం ఒకే దగ్గర ఉందాం డాడీ..’ అని హిమ రిక్వస్ట్ చేస్తాడు. వెంటనే కార్తీక్ కోపంగా.. ‘వద్దు నా వెనుక రావద్దు.. మీరేం భయపడకండీ.. నేను అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటాను..’ అంటూ అక్కడ నుంచి ఆవేశంగా వెళ్లిపోతాడు. సీన్ కట్ చేస్తే.. ఆదిత్య, శ్రావ్యలు దీప, కార్తీక్‌ల కాపురం గురించి బాధపడగా.. మురళీ కృష్ణ ఇంటికి వెళ్లి భాగ్యంతో ‘మోనితని, డాక్టర్ బాబుని కడిగిపారేశానంటూ జరిగింది చెబుతాడు. సీన్ కట్ చేస్తే.. పిల్లలు సరోజనీ ఇంటికి టీవీ చూడటానికి వెళ్తారు. కాసేపటికి వారణాసి మెషిన్ తెచ్చి దీప ఇంట్లో పెట్టి దీపతో.. ‘వెళ్లొవస్తాను’ అని చెప్పి తిరిగి వెళ్తుంటే కార్తీక్ ఎదురు పడతాడు.
 

కార్తీక్ రావడంతో వారణాసి ఆగిపోతాడు. కార్తీక్ మెషిన్ దగ్గరకు నడిచి.. ‘ఏంట్రీ ఇది?’ అంటాడు కోపంగా. ‘కుట్టమిషిన్ డాక్టర్ బాబు’ అంటాడు వారణాసి. ‘దేనికి?’ అంటాడు కార్తీక్ ఆవేశంగా. ‘నేనే తెమ్మన్నాను..’ అంటుంది దీప. ‘ఎందుకు’ అంటాడు కార్తీక్. ‘నా బతుక్కి అతుకులు వేసుకుందాం అని..’ సమాధానం ఇస్తుంది దీప. ‘ఇప్పటికి పడ్డ అతుకులు చాల్లేదా?’ అంటాడు కార్తీక్ కోపంగా. ‘నా పొట్టకొట్టాలనే మళ్లీ వచ్చారా?’ అంటుంది దీప. ‘వీడు దీన్ని తీసుకుని రావడం చూసే మళ్లీ వెనక్కి వచ్చాను..’ అంటాడు కార్తీక్. ‘ఇందాక నిప్పులో నీళ్లు పోశారు.. సరిపోలేదా.. ఇప్పుడు తినే కంచంలో కూడా నీళ్లుపోస్తారా?’ అంటుంది దీప ధీనంగా. ‘నీకు ఆరోగ్యమే బాలేదు అనుకున్నాను..చూపుకూడా మందగించినట్లు ఉంది..తినే కంచంలో చేయి కడిగేసుకుంది నేను..’ అంటాడు కార్తీక్ కోపంగా. ‘నేను కుదురుగా ఓ చోట కూర్చుని మెషిన్ కుట్టుకుంటాను.. నా పిల్లల్ని పోషించుకుంటాను..’ అంటుంది దీప. ‘మెషిన్ కుట్టి దాన్ని కలెక్టర్‌ని దీన్ని డాక్టర్‌ని చేస్తావా.. ఏం పాత తెలుగు సినిమా అనుకుంటున్నావా?’ అంటాడు కార్తీక్. ‘మరేం చెయ్యాలి.’ అని దీప అనడంతో.. ‘నోరు మూసుకుని ఇంటికి రావాలి..’ అంటాడు కార్తీక్. ‘అక్కడ నోరు మూయించారనే ఇక్కడికి వచ్చాను..’ అంటుంది దీప. ‘అయితే ఖర్చులకు డబ్బులు పంపిస్తాను..’ అంటాడు కార్తీక్. ‘భరణం కోరుకోవట్లేదు..’ అంటుంది దీప. ‘నేను దానం చేయట్లేదు..’ అంటాడు కార్తీక్. ‘ఇది నా పొట్టనింపుకునే ఆధారం.. ఇది కూడా వద్దంటే ఎలా?’ అంటుంది దీప బాధగా.. వారణాసి అంతా వింటూనే ఉంటాడు. ‘వద్దు..’ అని తేగేసి చెప్పిన కార్తీక్.. ‘రేయ్..’ అని వారణాసిని పిలుస్తాడు. ‘డాక్టర్ బాబు..’ అంటాడు వారణాసి కంగారుగా. ‘మర్యాదగా దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడ ఇచ్చేసిరా.. అక్కడేం చూస్తావ్ చెప్పింది చేయ్..’ అంటాడు వారణాసిని కోపంగా. ‘నిన్ను తెమ్మన్నది ఎవరు? ఉండనీ?’ అంటుంది దీప. ‘ఇచ్చి రమ్మన్నది ఎవరు? తీసుకుని వెళ్తావా లేదా?’ అనడంతో వారణాసి ఆ మెషిన్ అక్కడ నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. ‘నా బతుకు తెరువు నేను చూసుకోకుండా ఎందుకు అడ్డుపడుతున్నారు? ఎందుకు ఇలా వెంటాడి వేదిస్తున్నారు..’ అంటుంది దీప. ‘ఇక నేను ఇప్పుడే కాదు ఎప్పుడూ అంటే పదేళ్ల క్రితం కూడా నిన్ను ఇంట్లోంచి వెళ్లిపోయి నీ బతుకు నువ్వు చూసుకోమని చెప్పలేదు..’ అంటాడు కార్తీక్. ‘మీరు చెప్పరు ఎందుకంటే మీకు నిలువెత్తు సంస్కారం.. మీరు గెంటెయ్యరు.. ఎందకంటే మీది ఉన్నతమైన వ్యక్తిత్వం. మరి నేనెందుకు ఇక్కడికి వచ్చాను? పిచ్చిదాన్నా వెర్రిదాన్నా.. అహంకారమా నాకు..? ఎందుకు మళ్లీ ఈ పాత చూరు పట్టుకున్నాను?’ అంటుంది దీప బాధగా. ‘మూర్ఖత్వం..’ అని అరుస్తాడు కార్తీక్. ‘ఎందుకు మరి మూర్ఖులతో మాట్లాడి మీ సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు?’ అంటుంది దీప. ‘నీ తెలివితక్కువ తనంతో పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతున్నావ్..’ అంటాడు కార్తీక్. ‘అందుకే కదా ఈ సారి పిల్లల్ని మీ దగ్గరే వదిలేసి వచ్చాను.. ’ అంటుంది దీప. ‘నువ్వు వదిలించుకుందాం అనుకున్నా తల్లిని బిడ్డల్ని నేను వేరు చేయలేను. వాళ్లు తల్లి లేకుండా ఉండగలిగే పిల్లలు కాదు..’ అంటాడు కార్తీక్. ‘పిల్లలకు మీరు తండ్రి నేను తల్లిని కానీ మనం భార్య భర్తలుగా ఉండటం కుదరదు. కానీ మీ అమ్మగారికి కోడలిగా, పిల్లలకి తల్లిగా మాత్రమే ఉండాలంటే నా వల్ల కాదు..’ అంటుంది దీప. ‘నువ్వు ఎక్కడైనా ఉండు.. కానీ మందులు వాడు.. ఏ పని చేయకు.. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు.. నేను వెళ్తున్నాను’ అంటూ కార్తీక్ అక్కడ నుంచి బయలుదేరుతుంటే.. దీప అడ్డంగా వెళ్లి వెళ్లొద్దు అన్నట్లు అడ్డుపడుతుంది. మొత్తానికీ ఈ సమయంలో మరోసారి పిల్లలు బలి కాబోతున్నారు. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! ‘కార్తీకదీపం’ కొనసాగుతోంది. రేపటి ట్విస్ట్ Karthika Deepam Serial కీలక మలుపు: ‘నువ్వు చావబోతున్నావ్ దీపా ..’ ఎంతపని చేశావ్ డాక్టర్ బాబు vantalakka karthika deepam vantalakka karthika deepam telugu serial karthika deepam serial today episode karthika deepam serial karthika deepam may 13 episode

karthika deepam doctor babu karthika deepam Web Title : muralikrishna is perplexed when bhagyalakshmi gives him a reality check in karthika deepam serial today may 13 episode Telugu News from Samayam Telugu, TIL Network Telugu NewsTvNewsMuralikrishna Is Perplexed When Bhagyalakshmi Gives Him A Reality Check In Karthika Deepam Serial Today May 13 Episode

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి