Annavaram Temple Latest News Ticket Price Hiked Details

Annavaram Temple Latest News Ticket Price Hiked Details

రాష్ట్రంలోని ఫేమస్ టెంపుల్స్‌లో ఒకటిగా కొనసాగుత వస్తున్న అన్నవరం సత్యనారాయణ గుడికి వెళ్లే వారికి అలర్ట్. ఎందుకంటే అక్కడి దేవస్థానం కీలక నిర్ణయం తీసుంది. టికెట్ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అందువల్ల ఈ ఆలయానికి వెళ్లే వారు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకో వాలి.

అన్నవరం దేవస్థానంలో ఇది వరకు వ్రతం చేయించాలని భావిస్తే.. టికెట్ రేటు రూ. 800గా ఉండేది. అయితే ఇప్పుడు తాజాగా ఈ వ్రత టికెట్ రేటును రూ. 1000కి పెంచుతూ అన్నవరం ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. అంటే టికెట్ రేటు రూ. 200 మేర పైకి చేరిందని చెప్పుకోవచ్చు.

శుక్రవారం రోజున జరిగిన ధర్మకర్తల మండలి సమావేశానికి ఛైర్మన్‌ ఐవీ రోహిత్‌ అధ్యక్షత వహించారు. అలాగే అభివృద్ధి పనులపై ఈవో ఆజాద్‌, సభ్యులు చర్చించారు. అలాగే ఈ ధర్మ కర్తల మండలి సమావేశంలో 2023-24 సప్లిమెంటరీ బడ్జెట్‌కు కూడా ఆమోదం తెలిపారు.

ఇంకా ఈ ధర్మ కర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వివిధ రకాల అభివృద్ధి పనుల టెండర్లు, అంచనాలకు ఆమోదం తెలిపారు. దాత సహకారంతో దేవాలయానికి సంబంధించి అనివేటి మండపంలో బంగారు తాపడంతో ధ్వజ స్తంభం ఏర్పాటుకు తీర్మానించారు.

అదేసమయంలో కార్తీక మాసం వస్తోంది. ఈ తరుణంలో కార్తీక మాస ఏర్పాట్లపై కూడా ఈ ధర్మ కర్తల మండలి సమావేశంలో చర్చలు జరిగాయి. కార్తీక మాసంలో అన్నవరం సత్య నారాయణ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈవో తెలిపారు.

ఆలయానికి వచ్చే భక్తులకు సంబంధించి రద్దీ, ఉత్సవాల నిర్వహణపై వంటి అంశాలపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం కూడా నిర్వహించారు. పర్వ దినాల్లో ఏ రోజు ఎంత మంది భక్తులు రావొచ్చు అనే అంచనా వేసి తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆజాద్‌ తెలిపారు.

ఇంకా డిసెంబరు నెల 4వ తేదీన సత్య దీక్ష విరమణ సందర్భంగా మాలధారణ చేసిన భక్తులు అంతా గిరి ప్రదక్షిణ చేసేలా ప్రణాళిక రూపొందించామని ఆయన పేర్కొన్నారు. భద్రత, ట్రాఫిక్‌ మళ్లింపు, బారికేడ్ల ఏర్పాటు సహా వివిధ సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా చర్చించినట్లు తెలిపారు.

కాగా అన్నవరం దేవస్థానం ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి తెచ్చింది. www.aptemples.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ సేవలు పొందవచ్చు. స్వామివారి పూజ, దర్శనం, ప్రసాదం, కల్యాణకట్ట, అన్నదానం టికెట్లు, వసతి గదులు, కల్యాణ మండపాలను ముందస్తుగా బుకింగ్‌ చేసుకోవచ్చు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి