Black Garlic Is Full Of Health Benefits TO Control Diseases

Black Garlic Is Full Of Health Benefits TO Control Diseases

Black Garlic in Diet: నల్ల వెల్లుల్లి గురించి మీకు తెలుసా? దీనివలన కలిగే అద్భుత ప్రయోజనాలు ఎన్నో

Black Garlic in Diet: తెల్ల వెల్లుల్లి లాగా, బ్లాక్ వెల్లుల్లి కూడా ప్రయోజనాలతో నిండి ఉంది. అయితే నల్ల వెల్లుల్లి అంటే ఏమిటి? ఇది వేరే కూరగాయలా? ఇది మంచిదేనా? ఇక్కడ అన్ని విషయాలు తెలుసుకోండి..

తెల్ల వెల్లుల్లిలాగే, బ్లాక్ వెల్లుల్లి కూడా ప్రయోజనాలతో నిండి ఉంది. అయితే నల్ల వెల్లుల్లి అంటే ఏమిటి? ఇది వేరే కూరగాయలా? నిజానికి ఇది వేరే కూరగాయ కాదు. తెల్ల వెల్లుల్లియే నల్ల వెల్లుల్లిగా మారుతుంది. చాలామంది తెల్ల వెల్లుల్లిని ఇష్టపడతారు. దాని రుచి . వాసన రెండూ చాలా తేలికపాటివి.

పోషకాహార నిపుణుడు అమీ రిక్టర్ దాని ప్రయోజనాల గురించి మాట్లాడుతూ నల్ల వెల్లుల్లి వివిధ శారీరక సమస్యలను దూరం చేసి ఆరోగ్యంగా ఉంచుతుందని తెలిపారు.

నల్ల వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఈ లక్షణం ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఫలితంగా, ఇది రోగనిరోధక శక్తికి సహాయపడుతుంది.

నల్ల వెల్లుల్లిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఫలితంగా అనేక సంక్లిష్ట వ్యాధులు దూరమవుతాయి. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

నల్ల వెల్లుల్లి   శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

బ్లాక్‌గార్ల్‌ క్యాన్సర్‌ని నివారిస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే, ఈ విషయంలో మరింత పరిశోధన అవసరం.

మీరు నల్ల వెల్లుల్లితో టోస్ట్ స్ప్రెడ్‌ను సులభంగా తయారు చేయవచ్చు. డిప్స్ తయారీకి ఒక పదార్ధంగా కూడా ఉపయోగించవచ్చు. అదనపు రుచి కోసం ఫ్రైస్‌పై స్ప్రింకల్ చేయండి..

బ్లాక్ వెల్లుల్లి ప్రభావంతో బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మెదడు ఆరోగ్యానికి నల్ల వెల్లుల్లిని ఉపయోగించండి. వివిధ రకాల డిమెన్షియా వ్యాధులు దూరమవుతాయి.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి