Election Commission Allotte The Glass Symbol To Jana Sena And TDP Rebel Candidate Geetha

 Election Commission Allotte The Glass Symbol To Jana Sena And TDP Rebel Candidate Geetha

Janasena: గ్లాస్ గుర్తుపై మరో ట్విస్ట్.. టీడీపీ రెబల్ అభ్యర్థులకు కేటాయింపుపై ఈసీ క్లారిటీ..

ఏపీలో గాజు గ్లాస్‌ కోసం జరుగుతున్న ఫైట్‌లో కొత్త ట్విస్ట్‌ నెలకొంది. విజయనగరం టీడీపీ రెబల్ మీసాల గీతకు గ్లాస్ సింబల్ కేటాయించింది ఈసీ. ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు టికెట్ల సర్థుబాటులో తలమునకలైన పార్టీ అధ్యక్షులు తాజాగా ప్రచారంలో జోరు పెంచారు. అయితే పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో నామినేషన్ వేసి మేనిఫెస్టోలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే వైసీపీ మేనిఫెస్టో ప్రకటించిన ప్రచారంలో దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో కూటమి నేతలకు ఎన్నికల గుర్తు తలనొప్పిగా మారింది. ఆదివారం జనసేనకు గ్లాసు గుర్తును కామన్ సింబల్గా కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇదే క్రమంలో జనసేనకు గాజు గుర్తును కేటాయించగా స్వతంత్య్ర అభ్యర్థులకు ఎలా కేటాయిస్తారంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

దీనిపై స్పందించింది ఈసీ. తాము నిబంధనల ప్రకారమే కేటాయించామంటున్నారు ఎన్నికల అధికారులు. నిన్నటి వరకు గాజు గ్లాస్‌ గుర్తు ఫ్రీ సింబల్‌ లిస్ట్‌లో ఉన్నందున కేటాయించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమిలో భాగంగా జనసేన మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 21 స్థానాల్లోనే పోటీ చేస్తోంది. అందుకే జనసేన పోటీ చెయ్యని స్థానాల్లో ఇండిపెండెండ్ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును అందుబాటులో ఉంచారు ఎన్నికల అధికారులు. ఏ పార్టీలకు సంబంధంలేని స్వతంత్ర అభ్యర్థులు గ్లాస్ గుర్తు కోరితే కేటాయిచనున్నారు. ప్రస్తుతం టీడీపీ రెబల్గా పోటీ చేసిన మీసాల గీత ఆప్షన్ మేరకు గ్లాస్ గుర్తును ఇచ్చినట్లు స్పష్టం చేశారు ఎన్నికల అధికారులు. అయితే దీనిపై కూటమి నేతల్లో గందరగోళం నెలకొంది. అలాగే ప్రజల్లో కూడా పూర్తి అవగాహన రావాల్సి ఉంది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి