HCL Planning To Recruit 10000 Freshers In Coming Days

HCL Planning To Recruit 10000 Freshers In Coming Days

Freshers Jobs: ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్.. 10 వేల ఉద్యోగాలు కల్పించనున్న టెక్‌ దిగ్గజం

ఓవైపు ఆర్థిక మాంద్యం, ఉద్యోగుల తొలగింపు అంశం కలవరపెడుతోన్న విషయం తెలిసిందే. అయితే మరోవైపు కొన్ని కంపెనీలు ఉద్యోగులను నియమించుకోవడం ఊరటకల్పిస్తోంది. ఈ నేపథ్యంలో మొన్నటి మొన్న దేశీయ టెక్‌ దిగ్గజం టెక్‌ మహీంద్ర పెద్ద ఎత్తున ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో టెక్‌ దిగ్గజం భారీ ఎత్తున ఉద్యోగులను తీసుకోనున్నట్లు తెలిపింది.

ప్రముఖ టెక్‌ సంస్థ హెచ్‌సీఎల్‌ కొత్త ఉద్యోగులను నియమించుకోవడానికి సన్నహాలు చేస్తోంది. 2024-25 ప్రస్తుతానికి 10 వేల మంది ఫ్రెషర్లను తీసుకోనున్టన్లు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సీఈఓ విజయ్‌ కుమార్‌ తెలిపారు. మంచి ఆదాయ వృద్ధి రేటు(5.4%) కారణంగా మార్చి త్రైమాసికంలో 2700 మంది ఉద్యోగులను తీసుకున్నామన్న విజయ్‌.. 2024-25లో పరిస్థితులను బట్టి నియామకాలుంటాయని తెలిపారు.

ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ రంగంలో కొత్త ఉద్యోగాలు ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. జెన్‌ ఏఐ అవకాశాల కోసం కంపెనీ సిద్ధంగా ఉందని, ఇందులో భాగంగా 2000 మందికి పైగా ఏఐ డెవలపర్లను తీసుకోనున్నామని తెలిపారు. ఇక ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ ఇప్పటికే 25,000 మందికి శిక్షణ ఇవ్వగా, మరో 50,000 మందికి ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే కంపెనీల ఐటీ వ్యయాలు 2023-24 తరహాలోనే 2024-25లోనూ స్తబ్దుగానే కొనసాగవచ్చని విజయ్‌ అంచనా వేశారు. అయితే తమకు లభించి ఆర్డర్లు బాగున్నందున వృద్ధికి కచ్చితంగా సహాయపడతాయని అన్నారు. రానున్న రోజుల్లో జెన్‌ఏఐ ఆధారిత సైబర్‌ భద్రత, డేటా, క్లౌడ్‌ ఇమిగ్రేషన్‌, ప్రైవేటు ఏఐ స్టాక్‌ల నిర్మాణం తదితర విభాగాల్లో ఆర్డర్లు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి