pm kisan farmers can get rs three lakh loan with low interest rate know details..

pm kisan farmers can get rs three lakh loan with low interest rate know details..

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో (PM Kisan Scheme) ఉన్న రైతులకు అలర్ట్. పీఎం కిసాన్ రైతులకు రుణాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ పోర్టల్ ప్రారంభించింది. పీఎం కిసాన్ రుణ్ పోర్టల్ (PM Kisan Rin Portal) పేరుతో ఈ వెబ్‌సైట్ ప్రారంభమైంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ (Kisan Credit Card) ద్వారా పీఎం కిసాన్ రైతులకు రుణాలుఇవ్వడమే ఈ వెబ్‌సైట్ లక్ష్యం.ఇంకా కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాలు తీసుకోని రైతులు లక్షల్లో ఉంటారు. ఇప్పటివరకు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ద్వారా రుణాలు తీసుకోని రైతులకు, ఈ పథకం గురించి తెలియజేసి, రుణాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఘర్ ఘర్ కేసీసీ అభియాన్ పేరుతో డోర్ టు డోర్ క్యాంపైన్ కూడా నిర్వహిస్తోంది.

ముందుగా రైతులు https://fasalrin.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. లాగిన్ పైన క్లిక్ చేయాలి. మొబైల్ నెంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి. ఆ తర్వాత రైతులు తమ వివరాలతో కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయాలి. బ్యాంకులు ఈ వివరాలను వెరిఫై చేసిన తర్వాత, అర్హులైన రైతులకు రుణాలను మంజూరు చేస్తాయి.

ప్రస్తుతం పీఎం కిసాన్ రుణ్ పోర్టల్‌లో 97 కమర్షియల్ బ్యాంకులు, 58 రీజనల్ రూరల్ బ్యాంకులు, 512 కోఆపరేటీవ్ బ్యాంకులు చేరాయి. అంటే ఈ బ్యాంకులన్నీ రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రైతులు ఎంతైనా రుణాలు పొందవచ్చు. అయితే రూ.3 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వడ్డీ రాయితీ లభిస్తుంది. సాధారణంగా రైతులు రూ.3 లక్షల వరకు లోన్ తీసుకుంటే వార్షిక వడ్డీ రేటు 7 శాతం వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. కాబట్టి రైతులు రూ.3 లక్షల వరకు రుణాలకు 4 శాతం వడ్డీ చెల్లిస్తే చాలు. ఇక రూ.3 లక్షలకు మించిన రుణాలకు బ్యాంకులు వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి.

కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ 1998 లో ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , నాబార్డ్ కలిసి ఈ పథకాన్ని ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా రైతులకు కేవలం 4 శాతం వడ్డీ రేటుకే రూ.3 లక్షల వరకు రుణాలు అందిస్తుంది. రైతులందరూ కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం ద్వారా రుణాలు పొందవచ్చు. పంటల సాగు కోసం స్వల్పకాలిక రుణ అవసరాలను తీర్చడానికి బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చు.

 

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి